వైభవంగా అయ్యప్ప పడిపూజ
గొల్లపల్లి:మండలంలోని చిల్వాకోడూర్ శ్రీరామలింగేశ్వరస్వామి
ఆలయంలో అయ్యప్ప దీక్షస్వాములు సామూహిక మహాపడిపూజను బుధవారం వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పడిపూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దీక్షస్వాములు, గ్రామస్తులకు భిక్ష ఏర్పాటు చేయించారు. జగిత్యాల గురుస్వాములు నీలం దశరథరెడ్డి, కట్ట సత్యనారాయణ, గందె వేణు, గంధం పరంధాములు, అల్లాడి వెంకన్న పర్యవేక్షణలో గణపతి, గౌరీదేవి, షణ్ముక, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ విగ్రహానికి పూలు, పండ్లు, పంచామృతాభిషేకం, పేటతుల్లి చేపట్టారు. మహిళల కుంకుమ పూజలు చేశారు. స్వాముల ఆటలు, పాటలు ఆకట్టుకున్నాయి. రిటైర్డ్ ఏఎస్సై మల్లయ్య నృసింహస్వామి వేషధారణ, పోతలింగన్న నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. కచ్చు కొమురయ్యకు బొమ్మెన కుమార్, నరేందర్, ముక్తామణి గురుస్వాములు గురుదండన బహూకరించారు. ఆర్కెస్ట్రా సంగీత విభావరి హోరెత్తింది. ఆలయ చైర్మన్ దాసరి తిరుపతి, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, గురుస్వామి తాండ్ర లక్ష్మణ్‌గౌడ్, తొట్ల లక్ష్మీరాజం, గోపి,
వెంకన్న, గాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment