జిల్లాలో పోలీస్‌యాక్ట్ అమలు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల నేపథ్యంలో జిల్లాలో ఈనెల 31 వరకు సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీస్ అధికారి అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తాటిపల్లిలోని రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని, వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. ఫిట్‌నెస్ లేని వాహనాలు రోడ్డుపై తిప్పవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంవీఐలు రామారావు, ప్రమీల, శ్రీనివాస్ పాల్గొన్నారు.
వరదకాల్వకు నీటి విడుదల పెంపు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరదకాల్వకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 200, సరస్వతి కెనాల్‌కు 700, అలీసాగర్ ఎత్తిపోతలకు 487, గుత్పా ఎత్తిపోతలకు 270, తాగునీటి అవసరాలకు 107 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి
కోరుట్ల: డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జగిత్యాల ఏఎంవీఐ అభిలాష్, కోరుట్ల మోటర్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎంవీఐ యూనిట్ కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. వేగం కంటే ప్రాణాలు ముఖ్యమన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని సూచించారు. మెట్‌పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ టి. దేవరాజు, డ్రైవర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగుల కృషితోనే సంఘాలు బలోపేతం
వెల్గటూర్: ఉద్యోగుల కృషి ఫలితంగానే సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన పీఏసీఎస్ సీఈవో రాజయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. 43 ఏళ్లుగా సీఈవోగా పని చేసి, సంఘాన్ని అభివృద్ధి చేసి, లాభాల్లోకి తెచ్చేందుకు రాజయ్య కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాగసంకేత్, సంఘ చైర్మన్ గోళి రత్నాకర్, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రామ్మోహన్‌రావు, సంఘ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment