రోగిని పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది
జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందించాల్సిన సిబ్బంది పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇటీవల చికిత్స పొందుతున్న భర్తకు ఆసరాగా ఉన్న భార్య అనారోగ్యానికి గురికాగా.. ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయటకు పంపించారు. ఇటీవల రాయపట్నంలో తండ్రీకొడుకులకు కత్తిపోట్లు కాగా డ్యూటీ డాక్టర్, వైద్య సిబ్బంది ఉన్నా వారిని పట్టించుకోలేదు. వార్డుబాయ్‌తో చికిత్స అందించారు. తాజాగా గొల్లపల్లి మండలానికి చెందిన భూమయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చాడు. ఆయనకు మానసిక పరిస్థితి సరిగా లేదు. దీంతో అతడిని ఓ గదిలో పడేశారు. బెడ్డు మీద కాకుండా కింద పడుకున్నా.. వైద్య సిబ్బంది మాత్రం అతడికి వైద్యం అందించలేదు. ఈ విషయంపై సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా పేషెంట్ పరిస్థితి సరిగా లేదని, అతడిని బెడ్‌పై పడుకోబెట్టినా.. కిందనే పడుకుంటున్నాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment