ఆర్టీసీకి ‘సంక్రాంతి’ పండుగ
● కరీంనగర్ రీజియన్‌లో రూ.24.71కోట్ల ఆదాయం
కరీంనగర్: ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కలిసొచ్చింది. ప్రయాణికుల రాకపోకలతో అధిక ఆదాయం సమకూరింది. పండుగ సందర్భంగా ఈనెల 7 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపగా 13రోజుల్లోనే రూ.24.71 కోట్ల ఆదాయం సమకూరింది. 11 డిపో పరిధిలోని బస్సులు 43.21 లక్షల కిలోమీటర్లు తిరగగా.. 48.99 లక్షల ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. సంస్థకు రూ.24.71కోట్ల ఆదాయం సమకూరింది. గోదావరిఖని డిపో రూ.3.69 కోట్ల ఆదాయంతో మొదటిస్థానం, జగిత్యాల డిపో రూ.3.18 కోట్లతో రెండవస్థానం, కరీంనగర్–2 డిపో రూ.3.16 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి. రీజియన్ నుంచి 1,740 ప్రత్యేక బస్సులను నడపగా జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు 770 ప్రత్యేక బస్సులు, తిరుగుప్రయాణంలో కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు 970 ప్రత్యేక బస్సులు నడిపించారు. పండుగ సీజన్‌కు తోడు మహాలక్ష్మి పథకం తోడుకావడంతో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నారు. కరీంనగర్ రీజియన్ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో మకాం వేసి బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. దీంతో సంక్రాంతి ఆర్టీసీకి కలిసొచ్చింది.
ఆర్టీసీని ఆదరించాలి
కరీంనగర్ రీజియన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారందరికీ కృతజ్ఞతలు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయం తెచ్చేందుకు కృషి చేసిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లకు, డిపో మేనేజర్లకు శుభాకాంక్షలు. ముందస్తు రిజర్వేషన్లతో పాటు అదనపు చార్జీలు వసూలు చేయకుండా, మహాలక్ష్మి పథకం తోడు కావడంతో రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపి ఆదాయాన్ని సమకూర్చుకోగలిగాం.
– బి.రాజు, ఆర్‌ఎం, కరీంనగర్
ఈనెల 7 నుంచి 19 వరకు వచ్చిన ఆదాయం
డిపో ఆదాయం కిలోమీటర్లు ప్రయాణికులు
(రూ.కోట్లలో) (లక్షల్లో) (లక్షల్లో)
గోదావరిఖని 3.69 6.01 7.53
హుస్నాబాద్ 1.37 2.46 3.60
హుజూరాబాద్ 1.75 2.88 4.12
కరీంనగర్–1 2.70 5.21 5.48
కరీంనగర్–2 3.16 6.36 4.38
మంథని 1.49 2.59 2.54
జగిత్యాల 3.18 5.58 6.33
కోరుట్ల 1.90 2.99 3.74
మెట్‌పల్లి 1.79 2.86 3.86
సిరిసిల్ల 1.84 3.04 3.83
వేములవాడ 1.83 3.23 3.59
Comments
Please login to add a commentAdd a comment