హరహర మహాదేవ
వేములవాడ: రాజన్న ఆలయంలో సోమవారం జనజాతర కనిపించింది. ఆలయ ఆవరణ, క్యూలై న్లు, జాతరగ్రౌండ్ ప్రాంతాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. రద్దీని గమనించిన ఆలయ అధికారులు గర్భగుడి దర్శనాలు, అభిషేకాలు, అన్నపూజలను రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతలో భాగంగా జిల్లా పోలీసులు బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. శివదీక్షాపరుల నిత్యాన్నదానసత్రానికి వరంగల్‌కు చెందిన వాగ్దేవి విద్యాసంస్థల అధినేత దేవేందర్‌రెడ్డి దంపతులు కోసం రూ.1,01,116 విరాళం అందించారు. ఈవో వినోద్‌రెడ్డి, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్, సత్రం కోశాధికారి రాపెల్లి శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు మచ్చ కిషన్, కార్యదర్శి రమణయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment