నిరసనలు.. నిలదీతలు
● పథకాల ఎంపికకు అధికారుల గ్రామసభలు ● అనర్హులకు చోటు కల్పించారంటున్న ప్రజలు ● అధికారుల తీరుపై లబ్ధిదారుల విమర్శలు
జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా మారుతోంది. అర్హులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న గ్రామసభల్లో అధికారులకు నిలదీతలు.. నిరసనలు తప్పడం లేదు. అర్హులందరికీ రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులను ఈనెల 26 నుంచి అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకోసం అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో రూపొందించింది. వాటిని గ్రామసభల ద్వారా ప్రజల ఆమోదం కోసం సభలు నిర్వహిస్తోంది. అయితే జాబితాలో అర్హులు కాకుండా.. అనర్హులకు చోటు కల్పించారంటూ జిల్లావ్యాప్తంగా ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మంగళవారం ప్రారంభమైన విషయం తెల్సిందే. తొలిరోజు అంతంతమాత్రంగా వ్యక్తమైన నిరసనలు బుధవారం తీవ్రస్థాయికి చేరాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీస్తున్నారు.
అధికారుల నిలదీత
గ్రామాలు, మున్సిపల్ పరిధిలో సభలు నిర్వహిస్తున్న అధికారులకు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని, ప్రతిఒక్కరికీ పథకాలు అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా నిలదీతలు మాత్రం తప్పడం లేదు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. అలాగే చాలామంది జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
డబ్బుల వసూలు చేస్తున్నారని..
జగిత్యాల మండలం మోరపల్లిలో ప్రజాపాలన దరఖాస్తులకు డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు రోడ్డెక్కారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఘ ర్ పట్టి పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరో పించారు. రూ.660 తీసుకున్నారని, ఇళ్లు రావాలంటే రూ.500 ఇవ్వాలని ఫోన్‌పే చేయించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాలు, మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి అభ్యంతరాలే వ్య క్తమవుతున్నాయి. కొన్నిచోట్ల గ్రామ, వార్డు సభల పై ప్రచారం లేకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక వి షయమే గ్రామస్తులకు తెలియకుండాపోతోంది. మ రికొన్ని గ్రామాల్లో అధికారులు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతప్రజల్లో అవగాహన లేక గ్రా మసభలకు హాజరు కావడం లేదని సమాచారం.
మోరపల్లిలో గ్రామస్తుల ధర్నా
జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో అనర్హులను ఎంపిక చేశారని అదే గ్రామానికి చెందిన కొంతమంది ధర్నాకు దిగారు. గ్రామసభ రిజిస్టర్‌లో సంతకాలు చేయకుండా నిరసన వ్యక్తం చేశారు. మోరపల్లిలో లబ్ధిదారుల నుంచి రూ.500 కారోబార్ వసూలు చేశారని ఆందోళనకు దిగారు. గ్రామంలో అనర్హులకు చోటు కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మండల ప్రత్యేకాధికారి నరేశ్ రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్ గ్రామానికి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోమంటారు..?
తమకు ఇందిరమ్మ ఇళ్లు,
రేషన్‌కార్డులు, రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవడమేంటని అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. అప్పుడే దరఖాస్తులు ఇచ్చినా.. జాబితాలో పేర్లు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. పేర్లు లేకుంట మళ్లీ దరఖాస్తు చేసుకోవడమేంటని
ప్రశ్నించారు.
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్య ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కారోబార్ శ్రావణ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. బుధవారం జరిగిన గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఒక్కొక్కరి నుంచి కారోబార్ రూ.500 వసూలు చేసినట్లు దరఖాస్తుదారులు ఆందోళన చేశారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడంతోపాటు కారోబార్‌ను విధుల నుండి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment