అర్హులకు పథకాలు అందిస్తాం..
జగిత్యాలరూరల్: అర్హులందరికీ పథకాలు అందుతాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్తరేషన్‌కార్డుల ఎంపికకు గ్రామసభల ద్వారా అర్హులను గుర్తిస్తున్నామని, క్షేత్రస్థాయిలో సర్వే చేసి జాబితా తయారు చేశామని, గ్రామసభ ఆమోదంతో అర్హత పొందిన వారికి పథకాలు అందిస్తామని వెల్లడించా రు. పేర్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని, గ్రామసభల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నామని వెల్లడించారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు నిరంత ర ప్రక్రియ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు పాల్గొన్నారు.
పేర్లులేనివారు దరఖాస్తు చేసుకోవాలి
మల్యాల: జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి అన్నారు. మండలంలోని సర్వాపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో మాట్లాడారు. ముందుగా అనర్హులను ఎంపిక చేశారంటూ గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే చేసి, అర్హులను ఎంపిక చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జాబితా లో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ఎంపీడీఓ స్వాతి, ఏఓ చంద్రదీపక్, ఆర్‌ఐ రాణి తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment