హరితహారానికి సన్నద్ధం
● జిల్లాలో 47.75 లక్షల మొక్కలు లక్ష్యం ● నర్సరీల్లో పెంపకం పనులు ప్రారంభం
కథలాపూర్(వేములవాడ): జిల్లాలో 11వ విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారయంత్రాంగం సిద్ధమైంది. వచ్చే వానాకాలం సీజన్ ప్రారంభంలోనే మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వన నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు మట్టి, కవర్లు, విత్తనాలు సిద్ధం చేసుకున్నారు.
47.75 లక్షల మొక్కలు లక్ష్యం
జిల్లాలో 20 మండలాలు.. వీటి పరిధిలో 380 గ్రా మాలు ఉన్నాయి. ఊరూరా వననర్సరీలు ఏర్పాటు చేసి అందులో మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ఈసారి ప్రతి నర్సరీలో హరితహారం ప్రారంభం నా టికి కనీసం 11 వేల మొక్కలు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఆ యా వన నర్సరీల్లో 5 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కొత్తగా 42.69 లక్షల మొ క్కలు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 47.75లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
‘ఉపాధి’లో వననర్సరీలు
జిల్లాలో అన్ని గ్రామాల్లో వన నర్సరీలను ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్నారు. ఈ నర్సరీలకు మట్టిని ఇప్పటికే తెప్పించారు. ఉపాధి కూలీలతో మట్టిని శుభ్రం చేయించి ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపుతున్నారు. కొన్నిచోట్ల విత్తనాలు వేసి నీరుపడుతున్నారు. ఈ నర్సరీల నిర్వహణ బాధ్యత గ్రా మపంచాయతీలదే కావడంతో కార్యదర్శుల పర్యవేక్షణలో వనసేవకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతిరోజు నర్సరీల్లోని మొక్కలను చూసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment