సెలవులో కొండగట్టు ఈవో
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు సెలవుపై వెళ్లారు. ఆయన సుమారు 15 రోజులు సెలవు పెట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక్కడ పనిచేసిన రామకృష్ణారావును కొద్దిరోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెల్సిందే ఆయన స్థానంలో వేములవాడ రాజన్న ఆలయ ఈవోకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. అనంతరం వరంగల్‌లో పనిచేస్తున్న శ్రీకాంత్‌రావును ఇక్కడకు బదిలీ చేశారు. ఆయన అలావచ్చి బాధ్యతలు తీసుకుని ఇలా సెలవు పెట్టారు. మొన్నటివరకు ఈవో లేక ఆలయంలో సమస్యలు పేరుకుపోయాయి. ఇప్పుడు ఈవో లీవ్‌లో వెళ్లడంతో ఆ సమస్యలు అలాగే ఉండిపోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment