‘నూకపల్లి’ని జగిత్యాల బల్దియాలో కలుపుతాం
జగిత్యాలఅగ్రికల్చర్: మల్యాల మండలంలోని నూకపల్లి హౌసింగ్ బోర్డు కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో కలుపుతామని, గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సమీకృత మార్కెట్‌లో మిగిలిపోయిన పనులకు రూ.35లక్షలతో బుధవారం శ్రీకారం చుట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మార్కెట్‌తో రైతులు, వినియోగదారులకు లాభం జరుగుతుందని, ఇతర ప్రాంతాలకు కూరగాయలు, చేపలు, మాంసం ఎగుమతికి ఉపయోగపడుతుందని తెలిపా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు భారతి, నర్సమ్మ, రజీయోద్దిన్, అస్మా అంజుమ్ పాల్గొన్నారు.
లేఅవుట్ లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దు
జగిత్యాల: లేఅవుట్ లేని స్థలాల్లో నిర్మాణాలు చేపట్టొద్దని ఎమ్మెల్యే సూచించారు. జిల్లా కేంద్రంలో 10, 25, 26, 27, 39 వార్డుల్లో రూ.80 లక్షల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ ప్రకారమే స్థలాలు విక్రయించాలన్నారు.
పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు
కోరుట్ల: గ్రామసభల్లో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దని, మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. పట్టణంలోని 13, 29వార్డుల్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన సభలో పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హులను గుర్తిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని గుమ్లాపూర్, మాదాపూర్, జోగిన్‌పల్లి, ధర్మారంలో నిర్వహించిన గ్రామసభల్లో డీఆర్డీవో రఘువరన్ మాట్లాడారు.
గోదారమ్మకు మొక్కులు
ధర్మపురి: ధర్మపురి వద్దగల గోదావరిలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ధనుర్మాసం సందర్భంగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు గోదావరికి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ముందుగా గంగమ్మతల్లికి హారతి వదిలారు. నైవేద్యం చెల్లించారు. అనంతరం శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
జిల్లాస్థాయి
క్రీడాపోటీలకు ఆహ్వానం
జగిత్యాలటౌన్: నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం కో–ఆర్డినేటర్ మారం గణేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, షాట్‌పుట్, రన్నింగ్‌రేస్ విభాగాల్లో పోటీలు ఉంటాయని, 18 నుంచి 30 ఏళ్ల లోపువారు క్రీడల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment