కొనుగోలు కేంద్రాల సందర్శన | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల సందర్శన

Published Fri, Apr 19 2024 1:50 AM

లక్ష్మాపూర్‌లో ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌ఓ  - Sakshi

బచ్చన్నపేట: మండల పరిధి బండనాగారం, లక్ష్మాపూర్‌, కేసిరెడ్డిపల్లి, భోనకొల్లూర్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌ గురువారం సందర్శించారు. బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఆయా కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయిన విషయమై ‘సాక్షి’లో ప్రచురి తమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆయా సెంటర్లను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ ధాన్యాన్ని త్వరగా తూకం వేసి వెంట నే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బండనాగారంలో 26 మంది రైతులు 3,729 బస్తాలు, కేసిరెడ్డిపల్లిలో 36 మంది రైతులు 5,582 బస్తాల ధాన్యం ఇప్పటి వరకు మిల్లులకు చేరినట్లు తెలిపారు. లక్ష్మాపూర్‌లో ధాన్యం తేమ శాతం రానందున ఇంత వరకు కొనుగోలు చేయలేదన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాల్లోనే ధాన్యం మద్దతు ధరకు విక్రయించాలని, దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌లు శ్రీనివాస్‌, దేవనా యక్‌, పీఏసీఎస్‌ సీఈఓ బాలస్వామి పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement