శ్రీచండిక అమ్మవారికి బంగారు పుస్తెలతాడు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోని చండిక అమ్మవారికి బుధవారం బంగారు పుస్తెలతాడును మహబూబా బాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన భక్తులు సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపా రు. గోలి వెంకన్న, సుజాత, గోలి అరవింద్, భానుప్రియ, చల్లా మనోహర్, భవాని కుటుంబ సభ్యులు రూ.2.20 లక్షల విలువైన 29.540 గ్రాముల బంగారు పుస్తెలతాడు చేయించి బహూకరించినట్లు పేర్కొన్నారు. పూజ చేసి అమ్మవారికి అలంకరించినట్లు ఈఓ తెలిపారు.
వేలం ఆదాయం
రూ.31 లక్షలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 2024–25 ఆర్థిక సంవత్సరం కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాల విక్రయం,(అభిషేకం, వాహన పూజ సామగ్రి మినహా), కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వేలం ద్వారా రూ.31,05,000 ఆదాయం వచ్చినట్లు ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన వందన సోమయ్య కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాల విక్రయ హక్కు, పాలకుర్తికి చెందిన రంప నరేందర్ కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు దక్కించుకున్నట్లు చెప్పారు. తలనీలాల వేలానికి సరైన పాట రాక వాయిదా వేశామన్నారు.
బెస్ట్ ఫార్మర్ సర్టిఫికెట్
అందుకున్న రాజేశ్వర్‌రెడ్డి
చిల్పూరు: మల్కాపూర్‌కు చెందిన కర్షక నేస్తం.. మీఆలోచన కేశిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి బెస్ట్ ఫార్మర్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో రెండు రోజుల పాటు సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో రాజేశ్వర్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించారు. ఇందుకుగాను కాకతీయ, నాగ్‌పూర్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఈ సర్టిఫికెట్ ప్రదానం చేశారు.
రచనను విధుల్లోకి తీసుకోవాలి
జనగామ రూరల్: డీఎస్సీ–2024 అధికారుల తప్పిదానికి నష్టపోయిన రచనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాగ కైలాసం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దళిత మహిళా టీచర్ ఎంతో కష్టపడి డీఎస్సీలో రెండు ఉద్యోగాలు సాధిస్తే నేడు ఉద్యోగం లేదనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నా రు. ఇందుకు బాధ్యులను సస్పెండ్ చేసి రచన కు పోస్టింగ్ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందో ళనలు చేపడుతామని హెచ్చరించారు.
జమిలి ఎన్నికలు
ప్రజాస్వామ్యానికి ముప్పు
జనగామ రూరల్ : జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యనికి ముప్పు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ.అబ్బాస్ అన్నారు. ఎర్రగొల్లపహాడ్‌లో బుధవారం జరిగిన సీపీఎం జనగామ మండల మహాసభలో మైలారం వెంకటయ్య జెండా ఆవిష్కరించారు. అనంతరం పోత్కనూరి ఉపేందర్, రామవత్ మీట్య నాయ క్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అబ్బాస్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో జమి లి ఎన్నికలు తేవాలని చూస్తున్నదని, దీనివల్ల డబ్బులు ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి ఉంటుందన్నారు. రాష్ట్రాలు హక్కులు కోల్పో యే ప్రమాదం ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సాంబ రాజు యాదగిరి, బోడ నరేందర్, బూడిద గోపి, సుంచు విజేందర్, జోగు ప్రకాష్, గ్రామ శాఖ బైరగోని మల్లేష్, కార్యదర్శి గుండెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment