తేమ సాకుతో తిరస్కరణ
లింగాలఘణపురం: నెల్లుట్ల శివారు సత్యసాయి కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు బుధవారం తేమ అధికంగా ఉందంటూ పత్తి కొనుగోలుకు నిరాకరించడంతో రైతులు ఆందోళన చేపట్టారు. నిబంధనల ప్రకారం తేమ 12 శాతం లోపే ఉన్నప్పటికీ కొనుగోలు చేయకపోవడమే కాకుండా.. పత్తి తీసుకొచ్చి న వాహనాన్ని ఫొటో తీసి ఇతర మిల్లులకు షేర్ చేశారని.. అక్కడ కూడా కొనుగోలుకు నిరాకరించి ప్రైవేట్‌లో అమ్ముకునేలా చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సంబంధిత కేంద్రం సిబ్బంది మిల్లు నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కాటన్ పర్చేజింగ్ ఆఫీసర్ కె.నర్సిరెడ్డి, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాసు, మార్కెట్ చైర్మన్ శివరాజ్‌యాదవ్ చేరుకుని రైతులతో మాట్లాడి నచ్చజెప్పారు. సీసీఐ తిరస్కరించిన పత్తిని ప్రైవేట్ వ్యాపారస్తుల వద్దకు తీసుకెళ్తే అడ్డగోలుగా ధర తగ్గించి రూ.6,200 నుంచి రూ.6000 వరకు అడుగుతున్నారని, దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు వాపోయారు. దీంతో పత్తి నాణ్యతను బట్టి ధర నిర్ణయించి కొంత మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు.
సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద
రైతుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment