న్యాయం చేయాలంటూ రాస్తారోకో
జ ఫర్‌గడ్ : న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని మద్యం దుకాణాల ఎదుట బంధువులు, గ్రామస్తుతో కలసి మృతురాలి కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ నెల 5న మద్యం లోడ్‌తో వెళ్తున్న ఆటో.. బెక్‌ను ఢీకొట్టగా మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జఫర్‌గఢ్ శివారు వడ్డెగూడెంకు చెందిన బండ్ల యేసుమణి బ్యాంకులో పని నిమిత్తం కుమారుడితో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌కు బైక్‌పై మంగళవారం బయలు దేరింది. మండల కేంద్రం శివారు దాటాక ముందే వెనుక నుంచి బెల్ట్ దుకాణాలకు మద్యం తరలించే ఆటో ఢీకొట్టింది. యేసుమణి కిందపడడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న మృతురాలి కుమారుడు తీవ్రగా గాయపడ్డాడు. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకోవడంలో పోస్టుమార్టం ఆలస్యమైంది. తిరిగి బుధవారం జఫర్‌గఢ్‌కు చేరుకుని స్థానిక వైన్ షాపుల ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై రామ్‌చరణ్ చేరుకునని నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. పలువురు మధ్యవర్తులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళన నేపథ్యంలో మద్యం దుకాణ యజమానులు షాపులను ముందుగానే మూసి వెళ్లి పోయారు. మహిళ మృతికి కారుకుడైన ఆటో డ్రైవర్ వంశీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అతడిని అదుపులోకి తీసుకుని.. ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు.
వైన్‌షాపుల ఎదుట మృతురాలి
కుటుంబం, బంధువుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment