పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలి
జనగామ రూరల్: గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలి.. వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నెలనెలా సిబ్బంది అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. గ్రామపంచాయతీ వ్యవస్థ ఏర్పడి 60 సంవత్సరాలు గడిచినప్పటికీ సిబ్బందిని పర్మనెంట్ చేయకపోవడం పాలకుల దివాలాకోరు విధానాల కు నిదర్శనమన్నారు. ఈనెల 20వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్లాచా రి, పి.మల్లేశం, ఎం.రామ్‌నారాయణ, డి.పాండురంగం, ఎ.వెంకట్‌రెడ్డి, ఐలయ్య, గుర్రపు లాజర్, సోమన్న, పరంజ్యోతి, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, జింక బాబు తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు
రాపర్తి రాజు
కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment