స్టిక్కరింగ్ షురూ..
జనగామ: జిల్లాలో ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా బుధవారం ఇంటింటికీ స్టిక్కరింగ్ మొదలైంది. జిల్లాలో 1,62,512 గృహాలు ఉండగా మొదటి రోజు 59,616 ఇళ్లకు స్టిక్కర్లు వేశారు. ఈ ప్రక్రియ చేపట్టడానికి ఎన్యుమరేటర్లు ఉదయమే వార్డుల బాటపట్టగా.. సూపర్ వైజర్లు పర్యవేక్షించా రు. మొదటిరోజు పలు చోట్ల ఎన్యుమరేటర్లు కొంత ఇబ్బంది పడగా.. మధ్యాహ్నం వరకు ప్రక్రియ వేగం పుంజుకుంది. గ్రామాలు, మున్సిపల్ వార్డుల పరిధిలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఎన్యుమరేటర్లకు సహకారం అందించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యాన అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వసంత, సరిత, స్వరూప, రాము, రామారావు, రాణాప్రతా ప్, రవీందర్, ఎంపీడీఓ, తహసీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది పరిశీలించారు.
ప్రజలు సహకరించాలి : కలెక్టర్
కుటుంబ సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజ లు సహకారం అందించి వివరాలు తెలియ జేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా కోరారు. జనగామ మున్సిపల్ పరిధి వీవర్స్‌కాలనీ, గిర్నిగడ్డ, కురుమవాడలో స్టిక్కరింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆయన స్వయంగా పలు ఇళ్లకు స్టిక్కర్ అతికించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 8వ తేదీ వరకు ప్రతీ ఇంటికి స్టిక్కర్ వేసి 9వ తేదీ నుంచి సర్వే ప్రారంభిస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పాలకుర్తి టౌన్: కుల గణన సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో ఇళ్లకు స్టిక్కరింగ్ చేసే ప్రక్రియను ఆయన పరిశీలించారు. సర్వే కు ఇద్దరు ఉపాధ్యాయులు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. గైర్హాజరుపై వివరణ ఎందుకు తీసుకోలేదని ఎంపీడీఓను ప్రశ్నించా రు. ఇళ్లకు అంటించిన స్టిక్కర్లపై క్రమ సంఖ్య లేకపోవడంపై ఎంపీడీఓ రాములు, ఎంపీఓ రవీందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటాచారిపై కలెక్టర్ మండిపడ్డారు. షోకాజ్ నోటీసులు అందించాలని ఆదేశించారు. నంబర్ లేకుండా స్టిక్కర్ అంటించొద్దని సర్వే సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జి ఆర్డీఓ కె.సుశీల, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, ఏఈఓ రాఽధిక, ఆర్‌ఐ రాకేష్ ఉన్నారు.
మొదటి రోజు 59,616 ఇళ్లకు..
ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment