విజయం గుర్తింపు తెస్తుంది..
లింగాలఘణపురం: విజయం క్రీడాకారుడి జీవితా నికి ఎంతో గుర్తింపు తెస్తుందని సైక్లింగ్ అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.మల్లారెడ్డి అన్నారు. రెండు రోజులుగా మండల కేంద్రంలో జరిగిన 9వ అంతర్ జిల్లా రోడ్ సైక్లింగ్ చాంపియన్ షిప్–2024 పోటీలు బుధవారం ముగిసాయి. వరంగల్ జిల్లా ఒలంపిక్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి కైలాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని.. స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ పోటీలకు 380 మంది క్రీడాకారులు హాజరవడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కాంత్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జనగామ డీవైఎస్‌ఓ వెంకట్‌రెడ్డి, అథ్లెటిక్ కమిటీ చైర్మన్ మాక్స్‌వెల్ ట్రావర్, జిల్లా అధ్యక్షుడు కుమార్, కార్యదర్శి కిషన్, సంతోష్, ఎస్సై శ్రావణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ భిక్షపతి, మార్కెట్ డైరెక్టర్ శ్రీలతారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, వీరయ్య, మల్లేశం, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
సైక్లింగ్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు పి.మల్లారెడ్డి
ముగిసిన అంతర్ జిల్లా రోడ్ సైక్లింగ్
చాంపియన్ షిప్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment