విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
దేవరుప్పుల : విద్యతోనే అన్ని రంగాల్లో సమగ్రాభి వృద్ధి సాధ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. హనుమాండ్ల ట్రస్టు ప్రతిని ధి డాక్టర్ రాజేందర్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శనివారం చిన్నమడూరు హైస్కూల్‌లో సొంత నిధులతో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి రూ.లక్ష చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వశక్తితో ఎదిగేందుకు విద్య ఏకై క ఆయుధమని, అలాంటి విద్యానిలయాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి దాతల భాగస్వామ్యం అవసరమని పేర్కొ న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యంత ప్రమాణా లు కలిగిన ఉపాధ్యాయుల బోధన లభిస్తుందని, గ్రామీణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లల భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యుడు హనుమాండ్ల రాజరాంమోహన్‌రెడ్డి, ఎంఈఓ జి.కళావతి, తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ, వంగ దరశథ, పులిగిళ్ల వెంకన్న, మాజీ సర్పంచ్ కళమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment