రైతుభరోసాకు రెడీ..!
జనగామ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోబో తున్నారు. ‘భరోసా’ స్కీంకు సంబంధించి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేయగా.. కేబినెట్ సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. అయితే.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గుట్టలు, చెట్లు, కమర్షియల్ భూములకు రైతుబంధు ఇచ్చినట్లు విమర్శించిన కాంగ్రెస్ సర్కారు.. పథకం పేరును రైతుభరోసాగా మార్చి అందులో కీలక మార్పులు తీసుకువస్తోంది. సంక్రాంతి కానుకగా సాగు చేసే ప్రతీ రైతుకు పెట్టుబ డి సాయం అందేలా చర్యలు చేపడుతోంది.
జిల్లాలో 3.50లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా.. వానాకాలం వరి, పత్తి, ఇతర పంటలు కలిపి 3.20 లక్షల ఎకరాలు, యాసంగిలో 2లక్షల ఎకరాల వరకు రైతులు సాగు చేస్తున్నారు. ఏటా పంటల సాగును లెక్కించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. రైతు భరోసా పథకం అమలుకు జిల్లాలోని ప్రతీ మండలంలో 400 నుంచి 500ల ఎకరాలకు పైగా సాగు చేసే గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపి క చేశారు. రైతులు సాగు చేసే పంటల వారీగా సమాచారం తీసుకుని వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంట నే.. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తారు. పథకం అమలు విధి విధానా లు ఖరారు చేసే సమయంలో సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు.
3.50లక్షల ఎకరాలు.. రైతులు 1.90లక్షలు..
జిల్లాలో 3.50లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. రైతులు 1.90లక్షల మంది ఉన్నారు. వానాకాలం సీజన్‌లో వరి, పత్తి ఇతర ఆరుతడి పంటలు కలుపుకుని 3.20లక్షల ఎకరాలు, వానాకాలంలో 2 లక్షల ఎకరాల వరకు సాగవుతున్నది. 2023–24 యాసంగి సీజన్‌లో 1.99 లక్షల ఎకరాల్లో పంటల సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కించింది. ఈ సమయంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1,89,236 మంది రైతులకు పెట్టుబడి సాయం(రైతుబంధు) ద్వారా రూ.206.82 కోట్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అనర్హులకు పెట్టుబడి సాయం ఇచ్చినట్లు భావించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో అనేక మార్పులు తీసుకువస్తూ.. అసలైన రైతులకు ప్రతిఫలం దక్కేలా చర్యలు తీసుకుంటోంది. ఈసారి రైతుభరోసా స్కీంలో 30శాతం మేర రైతుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
12 గ్రామాల ఎంపిక
జిల్లాలో 12 మండలాలు ఉండగా.. ఒక్కో మండలం నుంచి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశాం. ప్రభుత్వం అందించే ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం అర్హులందరికీ అందించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో పంటల సాగును లెక్కిస్తారు. సర్కారు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తాం. ప్రభుత్వ నిబంధనల మేరకు ముందుకు వెళ్తాం.
– షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్
విధి విధానాలు ప్రకటించడమే ఆలస్యం..
పైలట్ ప్రాజెక్టు కింద 12 గ్రామాల ఎంపిక
సాగు వివరాల సేకరణకు సర్వం సిద్ధం
లబ్ధిపై అన్నదాతల్లో టెన్షన్ టెన్షన్..!
Comments
Please login to add a commentAdd a comment