అంధుల మార్గనిర్దేశకుడు లూయిస్ బ్రెయిలీ
● డీఆర్డీఓ ఎన్.వసంత
జనగామ రూరల్: అంధుల మార్గనిర్దేశకుడు లూయిస్ బ్రెయిలీ అని డీఆర్డీఓ ఎన్.వసంత అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్‌లో మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నిర్వహించి న కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంధులకు ప్రత్యేక లిపి కనిపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప దార్శనికుడు లూయిస్ బ్రెయిలీ అని అన్నారు. దివ్యాంగులకు ఆస్పత్రుల్లో త్వరితగతిన వైద్య సేవలు, సదరం ధ్రువీకరణ పత్రాల జారీ వేగవంతం చేయడంతోపాటు ఉపకరణాలు, వాహనా లు, ల్యాప్‌టాప్‌లు అందేలా చూస్తామని, రుణాల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం దివ్యాంగులతో కేక్ కట్ చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. బ్రెయిలీ లిపి క్యాలండర్ ఆవిష్కరించారు. సంక్షేమాధికారి ఫ్లోరె న్స్, ఉప వైద్యాధికారి రవీందర్‌గౌడ్, బాలిక విద్యా విభాగం అధికారి గౌసియాబేగం, ఎన్‌జీఓ సాధిక్ అలీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment