నయా దందా
ఎంజీఎం : వైద్యారోగ్యశాఖ అధికారుల తనిఖీలు కరువు కావడంతో వరంగల్ జిల్లాలో అనుమతి లేని ల్యాబ్‌ల నయా దందా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఓ ల్యాబ్ టెక్నీషియన్ కాకతీయ హెల్త్ కేర్ సెంటర్ పేరుతో సీకేఎం కాలేజీ గ్రౌండ్‌లో తక్కువ ధరలకే రక్త పరీక్షలు అంటూ కొ త్త దందాకు తెరతీశాడు. వరంగల్ చౌరస్తాలో తమకు ల్యాబ్ ఉందని, హనుమకొండలోని మణిపాల్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించి రక్త పరీక్షలు ని ర్వహిస్తామని పేర్కొంటూ.. పరీక్షలు చేయకుండానే నివేదికలు ఇస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ వైద్యమండలి సభ్యులు డాక్టర్ నరేశ్ ఆదివారం సీకేఎం కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుని అ క్కడ ఏర్పాటు చేసిన క్యాంపును తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ జనగామ జి ల్లాకు చెందిన ముక్క అరుణ్‌కుమార్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి కాకతీయ హెల్త్ కేర్ సెంటర్ పేరుతో తక్కువ ధరకు రక్త పరీక్షలు నిర్వహిస్తామని క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ల్యాబ్ రిపోర్టుల్లో పేర్కొన్న పథాలజిస్టులు డాక్టర్ నరేశ్‌బాబును ప్రశ్నించగా కాకతీయ హెల్త్ కేర్ సెంటర్‌కు తనకు ఏ సంబంధమూ లేదన్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాఽరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు నరేశ్ వివరించారు.
తక్కువ ధరకే రక్త పరీక్షలంటూ..
శాంపిల్స్ సేకరణ
అనుమతి లేని కాకతీయ హెల్త్‌కేర్
సెంటర్ మూసివేత
Comments
Please login to add a commentAdd a comment