ప్రాధాన్యతను కోల్పోని శతక ప్రక్రియ
హన్మకొండ కల్చరల్ : పన్నెండవ శతాబ్దంలో తెలుగుభాషలో మొదలైన శతక ప్రక్రియ నేటి వరకు తన ప్రాధాన్యత కొల్పోకుండా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నదని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. ఆదివారం హనుమకొండలోని ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్‌లో కాకతీయ పద్యకవితా వేదిక ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో చిదిరాల సుధాకర్ రచించిన పద్య పంచశతకము శ్రీజీవనపోరాటంశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవి సమ్మేళనంలో 30 మంది కవులు తమ కవితలతో అలరించారు. సమస్యాపృచ్చక చక్రవర్తి కంది శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక సమీక్షకులుగా చేపూరి శ్రీరాం, కేయూ తెలుగు అధ్యాపకులు డాక్టర్ మంథని శంకర్, డాక్టర్ మడత భాస్కర్, కొండా యాదగిరి, అక్కెర కరుణాసాగర్, సిద్దెంకి బాబు, గుంటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య
Comments
Please login to add a commentAdd a comment