ఉద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
జనగామ రూరల్: ఎన్నో ఏళ్లుగా సీపీఎస్ ఉద్యోగులను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీఎస్ సీపీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాకాని లక్ష్మ ణమూర్తి అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసనమండలిలో సీపీఎస్ పక్షాన మాట్లాడే వ్యక్తి లేకపోవడమే కారణమన్నారు. ఈసారి వరంగల్ నల్లగొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొలిపాక వెంకట స్వామిని బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించా లన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కొలి పాక వెంకటస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలిసోజు లింగమూర్తి, జిన్నారపు బుచ్చన్న ,జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం మనోజ్ కుమార్, కోశాధికారి బె జ్జం సునీల్ కుమార్, కందుల జీవన్ కుమార్ సు భాష్, రాజేష్,త్రిపాల్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.
సీపీఎస్ పక్షాన పోరాడే వారినే
గెలిపించాలి
యూనియన్ జిల్లా అధ్యక్షుడు
లక్ష్మణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment