మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కోమటిగూడెంలో పొట్లపల్లి రామచంద్రారావు సతీమణి సరళాదేవి జ్ఞాపకార్థం నిర్మాణం చేపట్టిన పల్లెదవాఖానను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం పాల్గొని మాట్లాడారు త్వరలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక వసతులతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని, ఘన్‌పూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.46కోట్లు మంజూరు చేసిందన్నారు. గ్రామాల్లో ప్రారంభించే పల్లె దవాఖానాలో అన్ని వసతులను ఏర్పాటు చేసి పేదలకు సత్వర వైద్యం అందించేలా చర్యలు తీసుకో వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. అనంతరం మండలంలోకి అక్కపెల్లిగూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, రూ.12లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇప్పగూడెం గ్రామానికి వంద ఇందిరమ్మ ఇండ్లు అందిస్తానని, గ్రామంలో కడియం మార్కు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన స్థలదాత పొట్లపల్లి రామచంద్రారావు, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, డీఎంహెచ్‌ఓ మల్లిఖార్జున్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్, నాయకులు తోట వెంకన్న, అజయ్‌రెడ్డి, పాపయ్య, రమేష్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కోమటిగూడెంలో పల్లె దవాఖాన ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment