సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
జనగామ రూరల్: ఏళ్ల తరబడి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందడం లేదని, తక్షణమే వారిని విద్యాశాఖలో క్రమబద్ధీకరించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు కనీస అవసరాలు తీర్చుకోలేక సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండటంతో తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్, తెలంగాణ కల్లు గీత, వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అ యిలి వెంకన్న, గౌడ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ, కమ్మగారి పరమేశ్వర్, జిల్లా గౌడ సంఘ నాయకులు వంగ రవి, నర్మెట్ట శ్రీనివాస్, గడ్డ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ జన హక్కుల పోరాట సమితి
రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment