వాసుదేవ్‌కు ‘వాస్తురత్న’ అవార్డు
పాలకుర్తి టౌన్: మండల కేంద్రానికి చెందిన చిలుకమారి వాసుదేవ్‌కు ‘వాస్తు రత్న’ అవార్డు అందుకున్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో వాసుదేవ్‌కు వాస్తు రత్న అవార్డు అందించారు. ఈ మేరకు వాస్తు రంగంలో పది సంవత్సరాలు చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవజ్ఞ రత్న బహుగ్రంథ రచయిత పుచ్చా శ్రీనివాసరావు, శ్రీ కాంతశర్మ, శృంగేరి శంకర మఠం, ఇంద్రకంటి వేంకట గోపాలకృష్ణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్ వద్ద స్నానాలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, ఒడిబియ్యం, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు నిర్వహించారు. గద్దెల ప్రాంగణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment