ముగిసిన ప్రతిభా పాటవ పరీక్ష
జనగామ రూరల్ : తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యాన గాంధీ గ్లోబల్ ఫ్యామి లీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ నేతృత్వంలో నిర్వహించి న జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పాటవ పరీక్ష శనివారం ముగిసింది. పట్టణంలోని ఏకశిలా బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడు తూ సాంఘిక శాస్త్రం మానవ సమాజానికి ప్రాధాన్యమైనదని పేర్కొన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ఫోరం తరఫున ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ప్రథమ, ద్వితీయ, తృతీ య(రూ.2,000, రూ.1,500, రూ.1,000) నగదు బహుమతులు అందజేశారు. ఈనెల 20న నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు కనకయ్య, సెక్టోరియల్ అధి కారులు రాజు, రమేష్, హెచ్‌ఎం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment