వేంకటేశ్వరుడికి ప్రత్యేక అలంకరణలు
చిల్పూరు: ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా చిల్పూరుగుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామికి శనివారం అర్చకులు రవీందర్‌శర్మ, రంగా చార్యులు, కృష్ణమాచార్యుల ఆధ్వర్యాన కదలీ ఫల(అరటిపళ్లతో), తులసి, వివిధ పుష్పాలతో అలంకరణ చేశారు. ఇందుకు దాత గుళ్లపల్లి శ్రీనివాస్–భవాని, ప్రేరణ తమలపాకులు అందజేశారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, గనగోని రమేష్ పాల్గొన్నారు.
ఆర్టీఏ సభ్యుడిగా నర్సింగరావు
జనగామ: జిల్లా ఆర్టీఏ సభ్యుడిగా మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు నియమితులయ్యారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశా ల మేరకు తెలంగాణ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగరా వు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబా టులో ఉంటూ ఆర్టీఏ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కలెక్టర్‌కు సన్మానం
జనగామ: న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యాన శనివారం సత్కరించారు. కలెక్టర్ చాంబర్‌లో ఆయనకు స్వీట్లు తినిపించారు. అనంతరం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌ను కలిసి స్వీట్లు అందజేశారు. కార్యక్రమంలో మిల్లర్లు గాదె శ్రీనివాస్, మర్యా ల లక్ష్మణ్, జిల్లా హరికిషన్, గూడురు సదాశివు డు, అమీన్, రాజు, వీరస్వామి పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: కలెక్టరేట్‌లోని ప్రధాన ఈవీ ఎం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివా రం సందర్శించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీ సు సిబ్బందిని ఆదేశించారు. ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు.
టెండర్ల ఆదాయం రూ.4.2లక్షలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అభిషేకం, వాహనపూజ సామగ్రి సరఫరాకు శనివారం నిర్వహించిన టెండర్‌తో రూ.4,20,000 ఆదాయం వచ్చి న ట్లు ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. కల్యాణ మండపంలో సీల్డ్ టెండర్‌ను డ్రా పద్ధతిన చేపట్టారు. ఆలయంలో అభిషేకం, వాహనపూజ సామగ్రి సరఫరాకు 42 మంది షెడ్యూ ల్ కొనుకొలు చేయగా.. పాలకుర్తికి చెందిన సింగ శ్రీలత హక్కు దక్కించుకున్నారు. మొ త్తం 18 రకాల టెండర్లకుగాను 9 పూర్తి కాగా, మిగతా 9 వాయిదా వేశామని, తిరిగి సీల్డ్ టెండర్లు నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని ఈఓ పేర్కొన్నారు. పాలకుర్తి ఎస్సై దూలం పవన్‌కుమార్ డ్రా తీయగా పర్యవేక్షులుగా కొడవటూరు దేవస్థానం ఈఓ వంశీ, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆర్‌ఐ రాకేష్, టెండర్‌దారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష డప్పులై మోగుతాయి..
జనగామ రూరల్: ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే లక్ష డప్పులై మోగుతాయని ప్రజా వాగ్గేయకారుడు గిద్దె రాంనర్సయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓంసాయి గార్డెలో దండోరా కళామండలి, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యాన జరిగిన కళాకారుల ధూంధాం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయాన్ని రక్షించేందుకు కవులు, కళాకారులు ఏకమై వర్గీకరణ అమలు పోరాటాన్ని ముందుకు నడపాలన్నా రు. మంద కృష్ణ ఆధ్వర్యాన ఫిబ్రవరి 7న తలపెట్టిన చలో హైదరాబాద్ ‘లక్ష డప్పులు, వేల గొంతులు’ దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనతో తాడోపేడో తేల్చుకుంటామన్నా రు. దండోరా కళామండలి జిల్లా అధ్యక్షుడు గజవెల్లి ప్రతాప్‌చిందు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్, నాయకులు కొయ్యాడ మల్లేష్, డాక్టర్ రాజమౌళి, కిషోర్, పైసా రాజశేఖర్, ప్రజాకళాకారులు సంజీవ, బాబు, జనగా మ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment