చిట్యాల: మండలంలోని నైన్‌పాక శివారులో బుధవారం రాత్రి టాటాఏస్ వాహనం బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మండలంలోని అందుకుతండాకు చెందిన భూక్యా సతీష్, దామరశెట్టి వీరయ్యలతో పాటు మరో ఇద్దరు రాంనర్సయ్య, లింగమూర్తిలు పరకాలకు వారి వ్యక్తిగత పనినిమిత్తం వెళ్లి తిరుగు వస్తున్న క్రమంలో నైన్‌పాక శివారులోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే 108కు సమాచారం అందించారు. అనంతరం 108 వాహన సిబ్బంది క్షతగాత్రులను చిట్యాల ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment