డీఎస్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు
భూపాలపల్లి రూరల్: విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన కోసం ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ బుధవారం అంబేడ్కర్ సెంటర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ నాయకులు భీమనాదుని సత్యనారాయణ, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కేతిరి రమేష్, లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు లావుడ్య మధుకర్ నాయక్, ఎస్సీ, ఎస్టీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఆశడపు రంగయ్యలు రవీందర్‌కు పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ విద్య, వైద్యం అందరికి ఉచితంగా అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాపాడేందుకు వ్యవస్థాపక అధ్యక్షుడు విశారధన్ మహారాజ్ ఆదేశానుసారం ఆమరణ నిరాహార దీక్ష చేట్టామన్నారు. దీక్షలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి, ఉపాధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్, వివిధ మండలాల నాయకులు పుల్ల అశోక్, శ్యామ్, స్వామినాధన్, అంగిడి ఓదెలు, దూడపాక శ్రీకృష్ణ, వడ్డేపల్లి శ్రీనివాస్, పంగ మహేష్, చిర్ర శ్రీకాంత్, మంతెన రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment