రాజకీయ లబ్ధికోసమే ఆరోపణలు
కాటారం : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తన రాజీకయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ, మంత్రి శ్రీధర్‌బాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలిమెల మండలంలోని భూముల విషయంలో పుట్ట మధు చేస్తున్న ఆరోపణలు దొంగే దొంగల్లో కలిసి దొంగా దొంగ అన్న చందంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నప్పుడు పలిమెల భూవివాదం ఆయన దృష్టికి రావడంతో రికార్డులను న్యాయనిపుణలతో పరిశీలన చేయించారని తెలిపారు. పుట్ట మధు, బీఆర్‌ఎస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సమావేశంలో మహిళా అధ్యక్షురాలు మహేశ్వరీ, యూత్ అధ్యక్షుడు మహేశ్, రమేశ్, అశోక్, విక్రమ్, పాల్గొన్నారు.
అసత్య ప్రచారం మానుకోవాలి
పలిమెల : స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోదరుడికి దక్కన్ సిమెంట్ కంపెనీలో 50 శాతం వాటా ఉందని కాంగ్రెస్ నాయకులే రైతుల భూములను కంపెనీకి కట్టబెట్టారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని, అసత్యప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండెబోయిన చిన్నన్న అన్నా రు. బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ రిజి స్ట్రేషన్ల పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించి రైతుల కు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలి పారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి వెంకటస్వామి,మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సారయ్య, పాల్గొన్నారు.
‘పుట్ట మధు ఆరోపణలు అవాస్తవం’
కాళేశ్వరం: పలిమెల మండలం డక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసిన భూముల్లో మంత్రి శ్రీధర్‌బాబు, అతని సోదరుడు శీనుబాబులకు వా టా ఉందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన ఆ రోపణలు అవాస్తవం అని కాంగ్రెస్ నాయకులు అ న్నారు. బుధవారం పార్టీ మండల అద్యక్షుడు అక్బర్‌ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజ బాబు ల ఆధ్వర్యంలో ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు. వారి వెంట మాజీ జెడ్పీటీసీ అరుణ, పీ ఏసీఎస్ చైర్మన్ తిరుపతి, నాయకులు విలాస్‌రావు, రామ్మోహన్, అశోక్, వామన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, షాహీన్, వరప్రపసాద్,సుధాకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment