అక్రమ నిర్మాణాలు తొలగింపు
రేగొండ : డ్రెయినేజీలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని నోటీసులు పంపిన స్పందించకపోవడంతో అధికారులు బుధవారం అక్రమ నిర్మాణాలను తొలగించారు. మండల కేంద్రంలోని పెద్ద బస్టాండ్ వద్ద పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారికి ఇరువైపుల డ్రెయినేజీ లైన్ నిర్మించారు. ఈ నిర్మాణాలపై కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. అలాగే మురుగునీరు ముందుకు ప్రవహించక పోవడంతో నీరంతా రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో ఆ దారి గుండా వెళ్లే పాదచారులు ఇబ్బందులు ఎదుర్కోగా, పలువురు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికారులు స్వచ్ఛందంగా తొలగించాలని నోటీస్‌లు పంపినా స్పందించక పోవడంతో గ్రామపంచాయతీ అధికారులు పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి ఆక్రమణలు తొలగించారు. ఈ క్రమంలో ఓ షాపు యాజమాని పోలీస్‌లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి తుల్జ రాణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment