![ఆస్తి పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్ నర్సయ్య - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/31/30alp304-210018_mr_0.jpg.webp?itok=wFi89Phe)
ఆస్తి పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్ నర్సయ్య
అయిజ: మున్సిపాలిటీ ప్రజలు విధిగా ఆస్తి పన్ను చెల్లించాలని, లేదంటే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య హెచ్చరించారు. గురువారం పట్టణంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆస్తి పన్ను వసూలు చేసే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో 82శాతం ఆస్తిపన్ను వసూలైనట్లు తెలిపారు. మొత్తం రూ.1.63 కోట్లకుగాను రూ.1.33 కోట్లు వసూలు చేశామన్నారు. ఇప్పటివరకు పన్ను చెల్లించని వారు శుక్రవారం వరకు ఆస్తిపన్ను చెల్లిస్తే పెనాల్టీ నుంచి మినహాయింపు పొందవచ్చని, ఆయా కాలనీల్లో బిల్ కలెక్టర్లు ఆస్తి పన్ను వసూలు కోసం వస్తారని వారికి పన్ను చెల్లించాలని కోరారు. అలాగే, మున్సిపల్ కార్యాయలంలో కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని అర్ధరాత్రి 12 గంటల వరకు పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పి స్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజేష్, సీనియర్ అసిస్టెంట్లు వీరేందర్, లక్ష్మన్న, బిల్ కలెక్టర్లు, సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment