![లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08gdl354-210035_mr-1739042141-0.jpg.webp?itok=YmJA1YXJ)
లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం
ధరూరు: ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరుకునేందుకు నిరంతరం కష్టపడి చదవాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. మండలంలోని మార్లబీడు గ్రామ శివారులోని నెట్టెంపాడు ఎత్తిపోతల క్వార్టర్స్‌లో కొనసాగుతున్న కేటీదొడ్డి మండల ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి కలెక్టర్ బస చేయగా.. శనివారం ఉదయం పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువు ఎంత ముఖ్యమో వ్యాయామం అంతే ముఖ్యమని, ప్రతి రోజు ఉదయం వాకింగ్ వంటి వాటిని చేసి ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చునని తెలియజేశారు. చదవడం ఒక్కటే కాకుండా దాని అసలైన అర్థాన్ని, ప్రాముఖ్యతను గ్రహించాలన్నారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు లాజికల్ ఆలోచనలను వృద్ధి చేసుకుంటూ చదవాలన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్‌ను, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో ఆహార నాణ్యత లోపంపై సంబంధిత కాంట్రాక్టర్, పర్యవేక్షణ లోపంపై వార్డెన్, ప్రిన్సిపాల్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఆహార నాణ్యత లోపంపై వివరణ ఇవ్వాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సక్రమంగా పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారుడిని అభినందించిన కలెక్టర్
గద్వాల: ఈ నెల 1, 2వ తేదీల్లో నేపాల్‌లో జరిగిన ఏషియన్ షూటింగ్ బాల్ చాంపియన్ షిప్‌లో ఇండియా మొదటి స్థానం నిలవడంలో.. అందులో జిల్లా క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ కనబర్చడం గొప్ప విషయమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం క్రీడాకారుడు కె.మంజూనాథ్‌ను కలెక్టర్ ఆయన చాంబర్‌లో ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం క్రీడాకారుడు, ఇతర క్రీడాధికారులు.. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి జితెందర్, పీడీ కృష్ణయ్య, బీసన్న, రాజేందర్ పాల్గొన్నారు.
విద్యార్థులు ప్రత్యేక తరగతులను
సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
భోజనం నాణ్యతగా లేకపోవడంపై వార్డెన్, ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment