మాట్లాడుతున్న డిస్ట్రిక్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ నరసింహులు
అయిజ: బాల్యం పిల్లల హక్కని, పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరగాలని డిస్ట్రిక్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ నరసింహులు అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాలలకు ప్రభుత్వం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి లక్ష్యం పెట్టుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రమశిక్షణతో ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలన్నారు. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు, వేధింపులకు గురిచేసినప్పుడు 1098 లేదా 100కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఐసీపీఎస్ కౌన్సిలర్ సురేష్, పాఠశాల హెడ్‌మాస్టర్ మల్లేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment