![హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06gdl501-210036_mr-1738870843-0.jpg.webp?itok=SqmVTIDW)
హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
మల్దకల్: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిత్య పరాశ్రీ స్వామిజీ భక్తులకు సూచించారు. గురువారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో శివస్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ దైవచింతనను కలిగి ఉండి ఆధ్యాత్మికపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు హిందువులంతా ఏక తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంట్లో ఉన్న దేవుడు ఇంటిల్లిపాదిని కాపాడితే, గుళ్లో ఉన్న దేవుడు లోకాన్ని రక్షిస్తాడన్నారు. యువత చెడు వ్యసనాలు వీడి సన్మార్గంలో నడవాలని, ప్రాచీన కాలం నుంచి వస్తున్న హిందూ సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటన్నింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు మనందరిపై ఉందన్నారు. అంతకుముందు ఆదిశిలా క్షేత్రంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా సంయోగ్ జగదీశ్వర్‌రెడ్డి, విహెచ్‌పీ నాయకులు దేవేందర్ రాజు, ఓబులేష్, రామాంజనేయులు, గోవిందు, రెడ్డప్ప, కిష్టన్న, రంగస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు , తిరుమలేష్, దుర్గాప్రసాద్, మల్దకల్, శివస్వాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment