![విద్యాభివృద్ధికి సమష్టి కృషి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06gdl176-210147_mr-1738870842-0.jpg.webp?itok=i9dnGHW-)
విద్యాభివృద్ధికి సమష్టి కృషి
గద్వాల: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్యభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులు తిరిగి వారిని పాఠశాలలు, కళాశాలలో చేర్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రక్తహీనత నివారణ కోసం రక్తపరీక్షలు నిర్వహించి విద్యార్థులకు సరైన పోషణ అందేలా చూడాలన్నారు. అలాగే, గ్రామీణ మహిళలను ఆరోగ్యపరంగా బలోపేతం చేయడం ద్వారా పిల్లల్లో తలెత్తే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. బాల్యవివాహాల నిరోధం, ఆడపిల్లలకు 18ఏళ్లు, మగపిల్లలకు 21 ఏళ్లు నిండిన తరువాతనే వివాహం చేయాలని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా గట్టు, కె.టి.దొడ్డి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. 15–18ఏళ్ల వయసు కీలక దశ కావడంతో ఆ దశలో పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. గ్రామీణ మహిళా సంఘాలు ప్రభుత్వ అనుకూల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, మురళికృష్ణ, నర్సింహులు, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment