సెక్యూరిటీ డిపాజిట్లు ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం
గద్వాల: సెక్యూరిటీ డిపాజిట్లు ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు చేస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్లను నాలుగు రకాలుగా విభజన చేసినట్లు ఇందులో భాగంగా వరిధాన్యం కొనుగోలు చేయాలంటే మిల్లర్లు గత బకాయిలు పెనాల్టీతో సహా పూర్తి చెల్లించాలని, అదేవిధంగా పదిశాతం బ్యాంకు గ్యారెంటీ లేదా, 25శాతం సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. రెండవ రకం మిల్లర్లు పాత బకాయిలతో పాటు 20శాతం బ్యాంకు గ్యారెంటీ లేదా 25శాతం సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలన్నారు. మూడవ రకం వాళ్లు వందశాతం బకాయిలు చెల్లించి 25శాతం పెనాల్టీలు ఉన్నవారు 25శాతం బ్యాంకు గ్యారెంటీ, లేదా 25శాతం సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలని, నాలుగవ రకం మిల్లర్లు డిఫాల్టర్లుగా మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించమన్నారు. అదేవిధంగా రైస్‌మిల్లర్ల అభ్యర్థన మేరకు అదనపు మిల్లింగ్ చార్జీలు కూడా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. క్వింటాల్ చొప్పున దొడ్డురకానికి రూ.30, సన్నాలకు రూ.40లు, చెల్లించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఎం విమల, డీఎస్‌వో స్వామి, రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment