గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
మానవపాడు: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండలకేంద్రంలోని గ్రంథాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రంథాలయలను అభివృద్ధి చేసి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తానన్నారు. జిల్లాలోని 9 శాఖ గ్రంథాలయలను, నాలుగు గ్రామీణ గ్రంథాలయాల్లో పాఠకులకు అన్ని వసతులు కల్పిస్తామని, మరింత సౌకర్యవంతంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం గ్రంథాలయంలో అవసరమైన మెటీరియల్ సైతం అందుబాటులో ఉంచుతామన్నారు.
లక్ష్యం మేరకు
పూర్తి చేయాలి
గద్వాల: వచ్చే నెల 15న బిజేపీ సంస్ధాగత ఎన్నికల ఉన్న నేపథ్యంలో బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా స్ధాయి కమిటీల సభ్యత్వాలను పూర్తి చేయాలని బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్ రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో క్రీయాశీల సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి బూత్‌లో అధ్యక్ష, ఆపై స్ధాయి పదవులకు బిజేపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయడానికి 100మంది సాధారణ సభ్యత్వం చేసిన వారికే క్రీయశీల సభ్యత్వం వస్తుందన్నారు. అనంతరం బిజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. స్నిగ్దారెడ్డి, సభ్యత్వ కో కన్వీనర్లు రామాంజనేయులు, నాగేశ్వర రెడ్డి, బిజేవైఎం నాయకులు రాజశేఖర్ శర్మ, దేవాదాస్ తదితరులు ఉన్నారు.
పత్తి క్వింటాల్ రూ.6,499
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి క్వింటాల్ గరిష్టంగా రూ.6,499, కనిష్టంగా రూ.6,179 లభించాయి. అదేవిధంగా మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,519, కనిష్టంగా రూ.1,449 , ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,121, కనిష్టంగా రూ.2,061 ధరలు లభించాయి.
ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
వనపర్తి: ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రభువినయ్ కొంతకాలంగా కార్యాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారంటూ పొలిటికల్ జేఏసీ రాచాల యుగంధర్‌గౌడ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విధితమే. విచారణ చేపట్టిన అధికారులు అనధికారికంగా సెలవులు తీసుకున్న కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తూ బుధవారం ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment