పట్టణాలు, గ్రామాల్లో సందడి..
ప్రతి ఇంటా సిరులు పండాలని అనందం నిండాలని జిల్లాలో ప్రతి వాకిట వెలుగులు విరియాలని కోరుతూ దీపావళి పండగను సంతోషంగా జరుపుకొంటున్నారు. ఏ వీధి చూసిన బాణసంచా చెప్పుళ్లే. పండగ కాస్తంత ముందుగానే వచ్చినట్లు కనబడుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ దీపావళి కళ ఉట్టిపదుతుంది. పండగ సందర్భంగా వచ్చిన బంధువులతో ఆయా గ్రామాల్లో సందడి నెలకొనగా.. పట్టణంలో మూడు రోజుల ముందు నుంచే తెరుచుకున్న టపాసు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. నూతన వస్త్రాల కోసం పిల్లాపెద్దలు తరలిరావడంతో వస్త్ర దుకాణాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. నూనె ఒత్తులను వెలిగించడం కోసం ఇంట్లో దాచిన ప్రమిదలు మళ్లీ సిద్ధమవుతున్నాయి. వైవిద్యభరితమైన వివిధ రకాలైన ప్రవిధలు మార్కెట్‌లో కొలువుదీరాయి. పూలదుకాణాలు, మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రంగురంగుల ప్రమిధలు కొనుగోళ్లు చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు. దీపావళికి రెండురోజుల ముందే ప్రత్యేకంగా ఇళ్లు, వాణిజ్య దుకాణాలల్లో పూజలు చేస్తూ దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా లక్ష్మీదేవికి పూజలు చేసి ధనాన్ని పొదుపుచేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. అంటే స్థిరాస్తి రూపాలైన బంగారం, భూమివంటి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. మరుసటి రోజు నువ్వులనూనే రాసుకుని, నలుగు పిండితో స్నానమాచరిస్తారు. ఉత్తరేణి మొక్కతో చిన్నపిల్లలకు దిష్టితీస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment