పకడ్బందీగా ఇంటింటి సర్వే నిర్వహించాలి
మల్దకల్: గ్రామాలలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ కాంతమ్మ అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బుధవారం మల్దకల్ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు జరగకుండా కుటుంబీకులతో పూర్తి సమాచారం తీసుకొని రికార్డులో పొందుపరచాలన్నారు. 18 రోజులు నిర్వహించే ఈ సర్వేపై గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి వారి నుంచి పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ రాజశేఖర్, ఎంఈఓ సురేష్, ఏపీఓ సుజాత, ఏపీఎం నరహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment