అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
గద్వాల అర్బన్: బీజేపీ అనుసరిస్తున్న కుల అణచివేత, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా దళితులను సమీకరించి పోరాటాలు ఉధృతం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవనంలో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కల్గిస్తూ, లౌకికత్వ భావనకు తూట్లు పొడుస్తుందన్నారు. దళితులపై దాడులు చేస్తూ అంటరానితనం, వివక్షను పెంచి పోషిస్తూ దళిత జాతిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేస్తోందని విమర్శించారు. దళిత జాతి ఐక్యంగా ఉండి బీజేపీ మతోన్మాద విధానాలను సంఘటితంగా ప్రతిఘటించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి పంపిణీ చేయాలని, కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, దళితవాడల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, దళిత మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పరంజ్యోతి, ఉపాధ్యక్షులు మారెన్న, విజయ్‌కుమార్, సవారన్న, జిల్లా కార్యదర్శి కరెప్ప, సహయ కార్యదర్శులు రాజు, ఆంజనేయులు, వెంకటస్వామి, సభ్యులు మద్దిలేటి, నాగరాజు, ప్రభుదాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment