కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం విక్రయించుకోవాలి
ధరూరు: రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్‌ను ఆయన మండల వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించడంతోపాటు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రభుత్వం సన్న రకం వడ్లకు నిర్ణయించిన మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ పొందాలని సూచించారు. అందుకు గాను తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, బయటి మార్కెట్‌లో విక్రయించి రైతులు మోసపోకుండా ప్రభుత్వం కేటాయించిన, నిర్ణయించిన మద్దతు ధరలకు విక్రయించుకోవాలని కోరారు. గన్నీ బ్యాగులు కూడా అందుబాటులో ఉన్నాయని, ఇప్పటి వరకు తేమ శాతం వచ్చిన వడ్లను తూకాలు చేసి నిర్ధేశిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment