అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఉదయం, రాత్రివేళ చలి విపరీతంగా ఉంటుంది.
ప్రైవేటుకు తరలుతున్న
ధాన్యం..
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం కన్నా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకే ఎక్కువ ధాన్యం తరలుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యంగా కొనసాగడం, రోజుల తరబడి రైతులు నిరీక్షించలేక ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,300 ఇస్తుండగా, సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 అందిస్తోంది. బోనస్ ధరతో కలుపుకుని సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,800 రైతులకు అందించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కేవలం రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతు నుంచి ధాన్నాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోగా కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,300 రైతు ఖాతాలో జమ అవుతాయని, మరుసటి రోజున 24 గంటల్లోపు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే చాలాచోట్ల రైతులు మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు నిరీక్షించకుండా తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధర కన్నా రూ.300 నుంచి రూ.500 వరకు తక్కువగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, సకాలంలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment