ఇసుకాసురుల నయా దందా | - | Sakshi
Sakshi News home page

ఇసుకాసురుల నయా దందా

Published Thu, Nov 21 2024 1:30 AM | Last Updated on Thu, Nov 21 2024 1:31 AM

ఇసుకా

ఇసుకాసురుల నయా దందా

పట్టుబడిన ఘటనలు ఇలా..

¢ నవంబర్‌ 1వ తేదీన ఏపీ నుంచి హైద్రాబాద్‌కు లారీలో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి ఉండవెల్లి పోలీసులు ఇటిక్యాల పాడు (ఘార్‌ ధాబా) వద్ద లారీని సీజ్‌ చేసి డ్రైవర్‌, యాజమానిపై ఉండవెల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

¢ అక్టోబర్‌ 2వ తేదిన మంత్రాలయం నుంచి ధరూరు మీదుగా లారీలో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి ధరూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని లారీని సీజ్‌ చేసి డ్రైవర్‌, యజమానిపై కేసు నమోదు చేశారు. తుంగభద్ర నది అవతలి వైపున ఉన్న కర్నూల్‌ పట్టణ శివారు ప్రాంతాల నుంచి రెండు రాష్ట్రాల సరిహద్దుల నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు.

ఉపేక్షించం..

అనుమతులు లేకుండా ఇసుక రావాణా చేస్తే సహించేది లేదు. అలాగే, సామర్థ్యానికి మించి ఇసుకను రిచ్‌ల వద్ద లోడ్‌ చేసినట్లు విచారణలో తేలితే సంబంధిత రిచ్‌ అధికారులపై చర్యలు ఉంటాయి. నాసీరకం ఇసుక అమ్మకాలపై నిఘా ఉంచి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. త్వరలో కలెక్టర్‌ అనుమతితో జిల్లాలోని ఇసుక రిచ్‌ల నుంచి ఇసుక అందేలా చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసరావు, ఎస్పీ

గద్వాల క్రైం: జిల్లాలో ఇసుక వ్యాపారులు నయా దందాకు తెరలేపారు. ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుకను సైతం అక్రమంగా ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికితోడు ఏపీ ప్రభుత్వం జీరో ఇసుక పాలసీ ప్రవేశపెట్టిన తరుణంలో సరిహద్దు జిల్లాగా ఉండడం ఇక్కడి ఇసుక వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. జిల్లా.. అటు ఏపీ, ఇటు కర్ణాటక రాష్ట్రాకలు సరిహద్దు కావడంతో అర్ధరాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున వ్యాపారులు ఇసుకను రాష్ట్ర సరిహద్దులకు రహస్యంగా చేరవేస్తున్నారు. అక్కడి నుంచి ఇసుకను డంపు చేసుకుని ఎడ్ల బండ్లపై తరలిస్తు అనుమానం లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అనుమతులతో అక్టోబర్‌ 28న గద్వాల పట్టణంలోకి సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్న మూడు భారీ వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఉండవెల్లి, ఇటిక్యాల, రాజోళీ, ధరూర్‌ పోలీసు స్టేషన్లో సైతం ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

ఫిల్టర్‌ ఇసుక దందా..

గద్వాల మండలంలోని గోనుపాడు, సంగాలకు చెందిన కేటుగాళ్లు సంగాల చెరువు సమీపంలో ఒండ్రు, సౌడు మట్టి నుంచి నాసీరకం (ఫిల్టర్‌) ఇసకను డంపులుగా ఏర్పాటు చేసుకుని గృహనిర్మాణదారులకు నాణ్యత లేని ఇసుకను విక్రయిస్తున్నారు. అయితే జూన్‌ 4వ తేదీన ఫిల్టర్‌ ఇసుకను గుట్టుగా ట్రాక్టర్‌ ద్వారా గద్వాలకు తరలిస్తున్న క్రమంలో సంగాల గ్రామానికి చెందిన ఓ కూలి గ్రామ శివారులో ట్రాక్టర్‌ కిందపడి మృతి చెందడంతో ఫిల్టర్‌ ఇసుక విషయం వెలుగులోకి వచ్చింది. అయినా ఫిల్టర్‌ ఇసుక సైతం యథేచ్ఛగా కొనసాగడం కొసమెరుపు. నాయకుల సహకారంతో వ్యాపారులు ఫిల్టర్‌ ఇసుకను గృహ నిర్మాణాదారులకు చేరవేస్తున్నారు.

ప్రభుత్వ నిర్మాణాల అనుమతులతో..

జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కాలనీలో పోలీసు బ్యారక్‌ నిర్మాణాలకు ఇసుక తరలింపు కోసం ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్‌కు అనుమతులు జారీ చేసింది. ఈ ఇసుకను గద్వాలకు చెందిన ఇసుక వ్యాపారులు అక్రమంగా గృహ నిర్మాణాదారులకు విక్రయించడం పరిపాటిగా మారింది. పోలీసు భవనాల నిర్మాణ కోసం ఇసుకను తీసుకెళ్తున్నట్లు వ్యాపారులు చూపిస్తూ.. ఈ దందా కొనసాగిస్తున్నారు. అయితే నాణ్యతతో వస్తున్న ఇసుక వాహనాలలో ఫిల్టర్‌ ఇసుకను లోడ్‌ చేసుకుని అక్కడికి తరలిస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో ఇసుక రిచ్‌లు ఉన్నా..

జిల్లాలో తుంగభద్ర పరివాహక ప్రాంతాలైన తుమ్మిళ్ల, వేణిసోంపురాం, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, కేశవరం వద్ద ప్రభుత్వం ఇసుక రిచ్‌లను ఏర్పాటు చేసి మన ఇసుక మన వాహనం పేరుతో గృహ నిర్మాణాదారులకు ఇసుకను ప్రభుత్వం విక్రయిస్తుంది. అయితే గత ఐదు నెలలుగా రిచ్‌ల వద్ద ఇసుక విక్రయాలు నిలిచిపోయాయి. ఇదే అదునుగా ఏపీ, తెలంగాణకు చెందిన ఇసుక వ్యాపారులు రెండు రాష్ట్రాల నాయకులతో ఒప్పందాలు చేసుకుని ఏపీలో జీరో ఇసుక పాలసీ ఉండడంతో ఇక్కడి ఇసుకను సైతం తరలిస్తున్నారు.

ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుక పక్కదారి

అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం

ఇదే అదునుగా ఫిల్టర్‌ ఇసుక విక్రయాలు

జిల్లాలో ఓవర్‌ లోడ్‌ వాహనాలపై

ఇటీవల కేసులు సైతం నమోదు

No comments yet. Be the first to comment!
Add a comment
ఇసుకాసురుల నయా దందా 1
1/2

ఇసుకాసురుల నయా దందా

ఇసుకాసురుల నయా దందా 2
2/2

ఇసుకాసురుల నయా దందా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement