క్రమశిక్షణ అలవర్చుకోవాలి
గట్టు: సృష్టిలోని 84లక్షల జీవరాసులలో మానవ జన్మ ఎంతో శ్రైష్టమైందని, క్రమ శిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆధ్యాత్మిక గురువు దయానంద నాగుల వెంకటేశం తెలిపారు. శ్రీపూర్ణానంద చంద్రశేఖరార్యుల 25వ వార్షిక పాదుక పూజ సందర్భంగా శుక్రవారం రాత్రి మాచర్ల ఆచల గురు మందిర ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ గురుపీట అధ్యక్షులు దామోదరస్వామి అధ్యక్షతన వేదాంత వైజ్ఞానిక మహాసభను నిర్వహించారు. శనివారం తెల్లవారు జామున వరకు వేదాంత వైజ్ఞానిక మహాసభ నిర్వహించారు. ఈ వేదాంత మహాసభలో తిరుపతి మోహన్‌రెడ్డిస్వామి, నెల్లూరు సులభాదేవీ, కర్ణాటకలోని యాద్గీర్ గురుమూర్తి స్వామి, హైదరాబాదు కోట్ల ఆనందం స్వామిలు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. మంత్రాలయం మల్లన్నగౌడ రచించిన మాననార్థ సంగ్రహం జ్ఞాన దేవతుకై వల్యమ్ అనే గ్రంథాన్ని అవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తీ శ్రీహరిస్వామి, మెదక్ సాంబశివుడు, హైదరాబాద్ జొన్నాడ కేశవులు, మంత్రాలయం మల్లన్నగౌడ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఆచల గురు మందిరం శిష్య బృందం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment