గద్వాల:జిల్లా మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయంలో గణితం, హిందీ విభాగాల్లో, ఆఫీసు సబార్టినేట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు, అదేవిధంగా జిల్లా మైనార్టీ జూనియర్ కాలేజీలో స్టాఫ్‌నర్స్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్వార్డ్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. దరఖాస్తులు ఈనెల 7వ తేదీలోపు జిల్లా మైనారిటీ కార్యాలయంలో సమర్పించాలని, గణితం సబ్జెక్టుకు ఎమ్మెస్సీ బ్యాథ్స్, బీ.ఈడీ, హిందీ హెచ్‌పీటీ, బీఈడీ విత్ పీజీ హిందీ అర్హత ఉండాలని, స్టాఫ్‌నర్స్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్ అర్హత, సబార్డినేట్ పోస్టుకు 10వ తరగతి అర్హత కలిగి ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారులు జిల్లా వాస్తవ్యులు అయి ఉండాలని, పూర్తి వివకాలకు సెల్ నం.9441780107, 746603995 లను సంప్రదించాలని తెలిపారు.
ఉచిత శిక్షణ తరగతులు
గద్వాల: రాష్ట్ర మైనార్టీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ –1,2,3,4 లకు సంబంధించి, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ మరియు బ్యాంకింగ్ ఇతర ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షల నిమిత్తం నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమేష్‌బాబు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 7వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని, వాటిని కలెక్టరేట్‌లోని జిల్లా మైనారిటీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
ఆర్డీఎస్‌లో వారబందీపద్ధతిన నీటి విడుదల
శాంతినగర్: ఆర్డీఎస్ చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరందించేందుకుగాను వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం డిస్ట్రిబ్యూటరీలు –24, 25, 25ఏ, 26ఏ, 6, 27, 27ఏ, 28, 29, 29ఏ నుంచి ఈ వరకు, డి–30, 31కు నీటిని నిలిపి వేస్తామని మిగతా డిస్ట్రిబ్యూటరీలకు యధావిధిగా నీటిపారుదల వుంటుందని తెలిపారు. పైన సూచించిన డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల వుండదని, రైతులు సహకరించాలని, ఈనెల 14, 24, వచ్చే నెల 3 వరకు వారబందీ పద్ధతి అమల్లో వుంటుందని వారు పేర్కొన్నారు.
సదరం క్యాంపు
షెడ్యూల్ విడుదల
గద్వాల: ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలలో క్రమంగా వికలాంగుల సర్టిఫికేట్స్ కొత్తవి, రెన్యూవల్ కోసం సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ప్రకటనలో తెలిపారు. మీ–సేవ కేంద్రాలలో ఈనెల స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్ణయించిన తేదీల్లో ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రికి హాజరు కావాల్సిందిగా తెలిపారు. ఈనెల 7,12,28 తేదీల్లో కంటి వికలత్వం, 08,15,22,29 తేదీల్లో శారీరక వికలత్వం వారికి, 9,16,23,30 తేదీల్లో శారీరక, మానసిక వికలత్వం గల వారికి, 10,17,24,31 తేదీల్లో చెవిటి, మూగ వికలత్వం గల వారికి క్యాంపులు నిర్వహిస్తున్నామని హాజరైన వారికి అదే రోజు సదరం సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గద్వాల క్రైం: పీహెచ్‌సీలలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ.. మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఏ చిన్న రోగం వచ్చినా ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. ప్రసవాల సంఖ్య సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఆన్‌లైన్‌లో నమోదు చేయలన్నారు.
అన్నదానానికి రూ.55వేల విరాళం
అలంపూర్: రాబోయే శివరాత్రి ఉత్సవాల్లో అన్నదానం నిమిత్తం కర్నూలుకు చెందిన భక్తులు రూ.55వేలు అందజేసినట్లు జోగుళాంబ ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ తెలిపారు. జోగుళాంబ శక్తిపీఠాన్ని శుక్రవారం కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ, లక్ష్మికాంతారెడ్డి, చింతన్న, కెవి.రమణారెడ్డి, కల్లా రమణారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సముదాయంలో ఉన్న ఈఓ కార్యాలయంలో శఅన్నదానం నిమిత్తం విరాళ చెక్కును జూనియర్ అసిస్టెంట్ బ్రహ్మయ్య ఆచారికి అందజేశారు. జోగుళాంబ ఆలయంలో రానున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్నదానం కోసం రూ.55,116 విరాళం అందజేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment