ఉత్తమ ఫలితాలు సాధించాలి
అలంపూర్/మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అలంపూర్, మానవపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. యాక్షన్ ప్లాన్ క్రమం తప్పకుండా పాటించాలన్నారు. మ్యాథమెటిక్స్, సైన్‌న్స్ విద్యార్థులకు ఎంసెట్ క్లాసులు తీసుకొని ర్యాంకులు వచ్చే విధంగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల సమయపాలన పెంచి ఉతీర్ణత శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగితే అడ్మిషన్లు పెరుగుతాయన్నారు. అంతకుముందు అకాడమిక్ రికార్టులను, విద్యార్థుల సంఖ్య, గైర్హాజర్, డ్రాప్ అవుట్ విద్యార్థుల వివరాలపై ఆరా తీశారు. హాజరు శాతం పెంచేందుకు, సబ్జెక్టుల వారిగా ఉత్తమ ఫలితాలు సాధించడానికి మార్గనిర్ధేశం చేశారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి హృదయ రాజు, ప్రిన్సిపల్ పద్మావతి, అధ్యాపకులు సుధారాణి, వెంకటరాణి, రాముడు, రాజు, రామచంద్రయ్య, రఘువీర్ కుమార్, లైబ్రరీయన్ మదన్ మోహన్, మునిస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment