ఆర్థికస్థోమత లేకనే నా భార్యను గద్వాల జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లా. ముక్కులో కండ పెరిగిందని.. తీసేయాలని డాక్టర్ చెబితేనే ప్రైవేట్‌కు తీసుకెళ్లా. ఆపరేషన్ కని లోపలికి తీసుకెళ్లిన వాళ్లు.. సీరియస్‌గా ఉందంటూ.. ఆగమాగం చేసి నాతో సంతకం చేయించుకున్నారు. నేనిచ్చిన రూ.15 వేలు నాకిచ్చి.. వారే అంబులెన్స్ మాట్లాడి కర్నూలుకు పంపించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొంది చనిపోయింది. మాకు ముగ్గురు పిల్లలు. అందరూ చిన్నోళ్లే. సర్వం కోల్పోయాం. ఎలా బతకాలి. ఎవరూ స్పందిస్తలేరు. మాకు న్యాయం చేయాలి.
– జమ్మన్న, మృతిచెందిన కవిత భర్త
ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు
2022 కంటే ముందు సర్వీస్‌లో జాయిన్ అయిన ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు క్లినిక్స్, ఆస్పత్రులు పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.2022 తరువాత ప్రభుత్వ సర్వీస్‌లో జాయిన్ అయిన వాళ్లు ప్రైవేటు క్లినిక్స్, ఆస్పత్రులు నిర్వహించకూడదు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందించకుండా ప్రైవేటు క్లినిక్స్, ఆస్పత్రులకు రెఫర్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే కచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే సంబంధిత ప్రైవేటు క్లినిక్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ సిద్దప్ప, డీఎంహెచ్‌ఓ, గద్వాల
ఎక్కడెక్కడ.. ఎలా అంటే..
● మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రధానంగా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన పలువురు వైద్యులకు న్యూటౌన్, రాజేంద్రనగర్, సుభాష్‌నగర్, మెట్టుగడ్డ, పద్మావతికాలనీ, బోయపల్లి గేట్ తదితర ప్రాంతాల్లో సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని.. ప్రైవేట్‌గా వైద్యసేవలందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment