రెండో రోజు పెరిగిన అర్జీలు | - | Sakshi
Sakshi News home page

రెండో రోజు పెరిగిన అర్జీలు

Published Thu, Jan 23 2025 1:17 AM | Last Updated on Thu, Jan 23 2025 1:17 AM

రెండో

రెండో రోజు పెరిగిన అర్జీలు

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ, వార్డు సభలు

పాల్గొన్న కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు

డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని గద్వాల వార్డుసభలో ప్రజల డిమాండ్‌

రేషన్‌కార్డుల కోసం అధికంగా దరఖాస్తులు

గద్వాల: ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు.. వీటిలో అర్హుల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించింది. బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ వార్డు సభలలో అధిక సంఖ్యలో అర్జిలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా రేషన్‌కార్డుల కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చాయి. గ్రామ సభల నిర్వహణను కలెక్టర్‌ బీఎం సంతోష్‌, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాలలో వివిధ గ్రామసభల్లో పాల్గొని పర్యవేక్షించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గ్రామ సభలలో పాల్గొన్నారు.

జిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలిలా..

మండలం రేషన్‌కార్డులు ఇళ్లు ఆత్మీయభరోసా రైతు భరోసా

గట్టు 911 87 54 6

గద్వాల రూరల్‌ 618 69 22 5

అయిజ రూరల్‌ 617 222 226 49

ఇటిక్యాల(ఎర్రవల్లి) 540 153 192 ––

కేటీదొడ్డి 511 101 –– 89

ధరూరు 506 281 222 39

మల్దకల్‌ 418 156 126 ––

మానవపాడు 316 108 98 ––

ఉండవెళ్లి 221 190 187 00

రాజోళి 188 29 23 8

మున్సిపాలిటీల్లో..

గద్వాల 2,153 439 –– ––

అయిజ 330 151 –– ––

అలంపూర్‌ 162 124 129 2

వడ్డేపల్లి 207 48 35 1

డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి..

గద్వాల పట్టణంలోని 36వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో పలువురు వార్డు ప్రజలు డబుల్‌బెడ్రూం ఇళ్లను ఇవ్వాలని కోరారు. గతంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కోల్పోయామని బాధిత నిరుపేదలు హైకోర్టు ఆశ్రయించగా డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి తమకు డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని వార్డు ప్రజలు కోరారు. ఈమేరకు వారు కలెక్టర్‌ సంతోష్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రెండో రోజు పెరిగిన అర్జీలు 1
1/1

రెండో రోజు పెరిగిన అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement